Share News

రైతులకు పరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:57 PM

): సంతబొమ్మాళి మండలంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు ముంపునకు గురై పంటలు దెబ్బతిన్న రైతులకు ్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ కోత మధుసూదనరావు కోరారు.

రైతులకు పరిహారం చెల్లించాలి
టెక్కలి ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేస్తున్న నాయకులు:

టెక్కలి/సంతబొమ్మాళి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు ముంపునకు గురై పంటలు దెబ్బతిన్న రైతులకు ్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ కోత మధుసూదనరావు కోరారు.ఈ మేరకు సోమవారం టెక్కలి ఆర్డీవో కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా మధుసూదనరావు మాట్లాడుతూ సంత బొమ్మళి మండలంలోని పలుప్రాంతాలతోపాటు కాకరాపల్లి తంపర ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సుమారు ఆరువేల ఎకరాల వరిపంట ముంపునకు గురయ్యిం దని తెలిపారు. మూలపేట పోర్టుకోసం నిర్మించిన రైల్వేరోడ్‌ రాజపురంవద్ద తంపరలో అడ్డంగా నిర్మించిన రోడ్‌వల్ల ముంపునకు గురైందని తెలిపారు. ముంపు కారణంగా ఉండే అడ్డంకులను తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. వడ్డితాం డ్ర-రావివలస ఆర్‌అండ్‌బీ రహదారికి మరమ్మతులుచేయాలని కోరారు. రావివలస ఈ రహదారిలో ఉందని, కార్తీక మాసంలో శివాలయం సందర్శనకు వేలాది మంది భక్తులు రానున్న దృష్ట్యా మరమ్మతులు చేయాలని కోరారు.

Updated Date - Oct 13 , 2025 | 11:57 PM