మృతురాలి కుటుంబానికి పరిహారం అందజేత
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:35 PM
కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన ఒడిశా రాష్ట్రం పాత్రపురం బ్లాక్‌లోని గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రంగాల రూప కుటుంబానికి ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆదివారం రాత్రి పరా మర్శించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 లక్షల చెక్కును మృతురాలి తండ్రి రంగాల ఢిల్లేసుకు అందించారు.
కవిటి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన ఒడిశా రాష్ట్రం పాత్రపురం బ్లాక్‌లోని గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రంగాల రూప కుటుంబానికి ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆదివారం రాత్రి పరా మర్శించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 లక్షల చెక్కును మృతురాలి తండ్రి రంగాల ఢిల్లేసుకు అందించారు. ఒడిశా ఎమ్మెల్యే సతీమణి మీనాద్యాన్ సామంతరాయ్ సమక్షంలో బాధిత కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండగా ఉంటుందని అశోక్ భరోసా కల్పించారు. కార్య క్రమంలో జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, కవిటి తహసీల్దార్ కె.మురళీ మోహన్, ఏఎంసీ చైర్మన్ మణిచంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
బోటు ప్రమాద బాధితులను ఆదుకుంటా
సోంపేట రూరల్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎకువూరు సమీపంలోని సముద్రంలో ప్రమాదానికి గురైన బోటు బాధితులను ఆదుకొనేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ‘సముద్రంలో బోటుబోల్తా’ శీర్షికతో వచ్చిన కథనానికి ఆయన స్పందించి సదరు ప్రదేశాన్ని పరిశీలించారు. ఆదివారం రాత్రి ఎక్స్‌కవేటర్ సాయంతో బోటును ఒడ్డుకు చేరినట్టు బాధిత మత్స్యకారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన మత్స్యకారులకు న్యాయం జరిగేలా మత్స్యశాఖ అధికారులతో మాట్లాడతానన్నారు.