Share News

స్వచ్ఛత ద్వారా సమాజాభివృద్ధి

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:13 PM

స్వచ్ఛత సాధించడం ద్వారా నిజమైన సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు.

స్వచ్ఛత ద్వారా సమాజాభివృద్ధి
విజేతలతో ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, డిశంబరు 28(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛత సాధించడం ద్వారా నిజమైన సమాజాభివృద్ధి సాధ్యపడు తుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు. కిస్న డైమండ్‌ అండ్‌ గోల్డ్‌, డలో తియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నగరం లో 5కె స్వచ్ఛతా మారథాన్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినంద నీయమన్నారు. మారథాన్‌లో 526 మంది పాల్గొ న్నారని, వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పొరేషన్‌ కమిషన ర్‌కు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ మారథాన్‌ రన్‌లో శ్రీకాకుళం జిల్లా 5వస్థానంలో నిలిచిం దన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రసాదరావు, సంస్థ డైరెక్టర్‌ హీత్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహన రావు, ప్రముఖ వైద్యుడు గొండు గంగాధర్‌, పీవీ రమణ, డి.విష్ణుమూర్తి, వై.పోలినాయుడు, వంగా మహేష్‌, పీవీఆర్‌ యాజమాన్యం పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:13 PM