ఆలస్యంగా స్కూలుకు వస్తున్నారని..
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:52 PM
పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారంటూ విద్యా ర్థులను లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహానికి గుర య్యారు. ఈ మేరకు సోమవారం పాఠశాల గేటుకు తాళంవేసి నిరసన తెలిపారు.
రోడ్డుపైనే విద్యార్థులు
గేటుకు తాళం వేసి తల్లిదండ్రుల నిరసన
ఆమదాలవలస, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారంటూ విద్యా ర్థులను లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహానికి గుర య్యారు. ఈ మేరకు సోమవారం పాఠశాల గేటుకు తాళంవేసి నిరసన తెలిపారు. వివరా లిలా ఉన్నాయి.. పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాల గత నాలుగు రోజులుగా ఆలస్యంగా వస్తున్నారంటూ విద్యార్థులను లోపలికి అను మతించడం లేదు. రోడ్డుపైనే వారిని నిలిపి వేస్తుండడంతో సమీపంలోని గ్రామాల విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాల యాజ మాన్య వింత పోకడలపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ సుమారు 70 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు. దీంతో పాఠ శాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు అక్కడికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఎంఈవో జి.రాజేంద్రప్రసాద్ విద్యార్థుల తల్లి దండ్రులతో మాట్లాడి విషయాన్ని జిల్లా ఉప విద్యాశాఖా ధికారి విజయకుమారి దృష్టికి తీసుకువెళ్లారు. సెయింట్ ఆన్స్ పాఠశాల వద్ద చోటుచేసుకున్న ఘటనపై జిల్లా విద్యా శాఖాధికారులు తెలుసుకుని డిప్యూటీ డీఈవోను పంపారు.
సొంత వాహనాల్లో వస్తే అనుమతించడం లేదు
మా పిల్లలు గ్రామాల నుంచి ఆటోల్లో ఉదయం 8.30 గంటలకు వచ్చినా లోపలికి అనుమతిం చడం లేదని, అదే పాఠశాలకు చెందిన వాహనం 9 గంటలకు వచ్చినా అనుమతిస్తున్నారని విద్యార్థుల తలి ్లదండ్రులు డిప్యూటీ డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. పాఠశాల సమయం అయిపోయిందంటూ మా పిల్లలను నిత్యం రద్దీగా ఉండే రోడ్లపైనే ఉంచేస్తుండడంతో ఎండలో ఇబ్బందులు పడ డంతో పాటు ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు. కణుగులవలసకు చెందిన తల్లి దండ్రులు మాట్లాడుతూ.. తాము ఫీజులతో పాటు ఏడా దికి సంబంధించిన బస్సు చార్జీలను పాఠశాల యాజ మాన్యానికి చెల్లించి నెలలవుతున్నప్పటికీ మా గ్రామానికి పాఠశాల బస్సు రావడం లేదని డిప్యూటీ డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు.
బయట ఉంచడం సరికాదు: డిప్యూటీ డీఈవో
విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య ప్రతినిధులను విచారించిన తరువాత డిప్యూటీ డీఈవో విజయకుమారి మాట్లాడుతూ.. పాఠశాల సిబ్బందిపై అసహనం వ్యక్తంచేశారు. సమయ పాలన పాటించినా.. పది నిమషాలు అటు ఇటుగా విద్యార్థులను తరగదు లకు అనుమతించాలన్నారు. ఒకవేళ మరింత ఆలస్యంగా వస్తే పాఠశాల ఆవరణలో ఉంచాలి తప్ప రోడ్డుపై, ఆరుబయట ఉంచడం సమంజసం కాదన్నారు. అనంత రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆం దోళనలో అర్థం ఉందని, అయితే పాఠశాల నియమా లను కూడా పాటించాలంటూ తెలియజేశామన్నారు. యాజమాన్యం కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ ఘటనపై నాలుగు రోజు ల్లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమాధానం ఇవ్వాలని నోటీసు ఇచ్చామన్నారు.