Share News

Hospital: ప్రసవానికి వస్తున్నారా.. ఫ్యాన్‌ తీసుకురండి

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:47 PM

Maternity Hospital ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వైద్యసేవలు, కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. కొత్తూరు సామాజిక ఆస్పత్రిలోని పలువార్డుల్లో సీలింగ్‌ ఫ్యాన్‌లు సక్రమంగా తిరగడం లేదు. దీంతో వేసవి వేళ ప్రధానంగా గర్భిణులు, బాలింతలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.

Hospital: ప్రసవానికి వస్తున్నారా.. ఫ్యాన్‌ తీసుకురండి
కొత్తూరు ఆసుపత్రిలో సొంతప్యాన్‌లు తెచ్చుకొని వినియోగిస్తున్న బాలింతలు

  • కొత్తూరు సీహెచ్‌సీలో ఉక్కపోత

  • గర్భిణులకు తప్పని అవస్థలు

  • కొత్తూరు, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వైద్యసేవలు, కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. కొత్తూరు సామాజిక ఆస్పత్రిలోని పలువార్డుల్లో సీలింగ్‌ ఫ్యాన్‌లు సక్రమంగా తిరగడం లేదు. దీంతో వేసవి వేళ ప్రధానంగా గర్భిణులు, బాలింతలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సామాజిక ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చేవారు.. ఇళ్ల నుంచే ఫ్యాన్‌లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఫ్యాన్‌లు తెచ్చుకోనివారు గాలి కోసం నరకయాతన పడుతున్నారు. బాలింతలు ఉండే గది పడమర భాగాన ఎటువంటి భవనాలు లేవు. దీంతో ఎండతీవ్రతతో గోడలు వేడి ఎక్కిపోతున్నాయి. ఫలితంగా రూములో ఉష్ణోగ్రత పెరిగిపోవడం.. సీలింగ్‌ ఫ్యాన్‌లు లేకపోవడంతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రికి మంజూరయ్యే అభివృద్ధి నిధులతో కనీసం కొత్త ఫ్యాన్‌లు అయినా ఏర్పాటు చేయాలని బాలింతలు, గర్భిణులు కోరుతున్నారు. ఈ విషయమై సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ధర్మాన కిషోర్‌ వద్ద ప్రస్తావించగా.. ‘బాలింతల గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌లు ఉన్నాయి. వీటి గాలి చాలకపోవటం వలన ఎండ తీవ్రతకు ఇళ్ల నుంచి ఫ్యాన్‌లు తెస్తున్నారు. కొత్త ఫ్యాన్‌లు ఏర్పాటు చేస్తామ’ని తెలిపారు.

Updated Date - Apr 30 , 2025 | 11:47 PM