Collapsed Bridge : కూలిన సైపాన్ వంతెన
ABN , Publish Date - May 17 , 2025 | 12:24 AM
Saipan bridge collapse నందిగాం మండలం ఆనందపురం వద్ద సైపాన్ వంతెన శుక్రవారం కూలిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 26ఏళ్ల కిందట వంశధార శాఖ ఆధ్వర్యంలో కొండనీరు చెరువుకు వెళ్లేందుకుగాను ఈ వంతెన నిర్మించారు.
నిలిచిన రాకపోకలు
వంశధార అధికారుల పరిశీలన
నందిగాం, మే 16(ఆంధ్రజ్యోతి): నందిగాం మండలం ఆనందపురం వద్ద సైపాన్ వంతెన శుక్రవారం కూలిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 26ఏళ్ల కిందట వంశధార శాఖ ఆధ్వర్యంలో కొండనీరు చెరువుకు వెళ్లేందుకుగాను ఈ వంతెన నిర్మించారు. శుక్రవారం ఉదయం మండలంలోని పాత్రునివలస నుంచి హరిదాసుపురం లారీలు వెళ్లే సమయంలో వంతెన పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ రాకపోకలు సాగించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వంతెన కూలిపోవడంతో ఆనందపురం, హరిదాసుపురం, మాదిగాపురం తదితర గ్రామాల ప్రజలు జాతీయరహదారికి వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. దీంతో చుట్టూతిరిగి తురకలకోట మీదుగా జాతీయరహదారికి చేరుకుంటున్నారు. వంతెన నిర్మించే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు. టెక్కలి వంశధార ఈఈ శేఖర్‌బాబు కూలిన సైపాన్ వంతెనను పరిశీలించారు. ప్రజల రాకపోకలకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలిస్తున్నామని తెలిపారు. వంతెన సకాలంలో నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీఈఈ సుధాకర్, జేఈ రాజశేఖర్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.