Share News

rule for the people: ప్రజల కోసమే.. కూటమి పాలన

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:54 PM

Successful rally with tractors కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పడానికి అన్నదాత సుఖీభవ పథకమే నిదర్శనమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల పొడవునా ట్రాక్టర్లు, బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

rule for the people: ప్రజల కోసమే.. కూటమి పాలన
పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ..

ఎమ్మెల్యే గౌతు శిరీష

విజయవంతంగా ట్రాక్టర్లతో ర్యాలీ

పలాస, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పడానికి అన్నదాత సుఖీభవ పథకమే నిదర్శనమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల పొడవునా ట్రాక్టర్లు, బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయమార్కెట్‌ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ ‘ఎన్నికల హామీల్లో భాగంగా తొలుత పింఛన్లు నగదు పెంచాం. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాకు నగదు జమచేశాం. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో తొలివిడతగా రూ.7వేలు జమ చేశాం. ఈ నెల 15 నుంచి మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ప్రతీ హామీని అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింద’ని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైసీపీ నాయకులకు కనిపించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, రాష్ట్ర బిసిసెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, ఎం.నరేంద్ర(చిన్ని), టంకాల రవిశంకర్‌గుప్తా, జోగ మల్లి, కొత్త సత్యం, ఎ.రామకృష్ణ, యవ్వారి మోహనరావు, కొర్ల కన్నారావుతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంక్షోభం వీడి.. సంక్షేమం వైపు.. : ఎమ్మెల్యే గోవిందరావు

పాతపట్నం: ‘వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. నేతు సీఎం చంద్రబాబు నేతృత్వంతో సంక్షేమ బాట పట్టింద’ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకంనిధులను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాతపట్నంలో రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లుతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏఎంసీ ప్రాంగణంలో ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ.. ‘అన్నదాతకిచ్చిన మాటను చంద్రన్న నిలబెట్టుకొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48గంటలలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తూ వారికళ్లల్లో ఆనందం నింపారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామ’ని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌, ఏఎంసీ అధ్యక్షుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


govind.gif

Updated Date - Aug 12 , 2025 | 11:54 PM