ఆటోడ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:58 PM
ఆటోడ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం స్థానిక సత్యవరం జంక్షన్ వద్ద ఆటోడ్రైవర్ల సేవలో కార్య క్రమాన్ని ఆయన ప్రారంభించారు.
నరసన్నపేట, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆటోడ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం స్థానిక సత్యవరం జంక్షన్ వద్ద ఆటోడ్రైవర్ల సేవలో కార్య క్రమాన్ని ఆయన ప్రారంభించారు. సత్యవరం జంక్షన్ నుంచి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వరకు ఆటో నడిపి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ, క్యాబ్‌లు నడిపే వారికి వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగించడంతో పాటు ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తోంద న్నారు. నియోజవర్గంలో 1,578 మందికి ఈ పథకంలో ఆర్థిక చేయూతనిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొందరి, కూరాకుల కార్పొరేషన్ చైర్మన్ దామోదర నర్సింహులు, కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పోగోటి ఉమామహేశ్వరి, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కల్పనతో పేదరిక నిర్మూలన..
ఆమదాలవలస, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఉపా ధి కల్పనతోనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నా రు. శనివారం ఆమదాలవలసలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా కొందరు ఆటో డ్రైవర్లను శాలువలతో సత్కరించా రు. అనంతరం ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సి పాలిటీ పరిధిలో ఉన్న 1813 మంది ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతోందని తెలిపారు. నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్ర బాబునాయుడును ఒప్పిస్తే కొంతమంది వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్య మ్రంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినని గీతా విద్యాసాగర్, టీడీపీ నాయకులు మొదలవలస రమేష్, ఆనెపు రామకృష్ణ, బోర గోవిందరావు, డాక్టర చాపర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమానికి పెద్దపీట..
పలాస/కాశీబుగ్గ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ రానున్న మూడున్నరేళ్ల కాలంలో ప్రజలు ఎన్నడూ లేని అభి వృద్ధి ఫలితాలు అందుకో బోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులకు చెక్కును అందించారు. కార్యక్రమం లో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, టీడీపీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వర రావుయాదవ్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, పీసీఎంఏ ప్రధాన కార్యదర్శి టంకాల రవిశంకర్‌గుప్తా, ఆటో కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరినీ ఆదుకోవడమే ధ్యేయం..
రణస్థలం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక జడ్‌పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంబించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల సంక్షే మం దిశగా ప్రభుత్వం పెద్ద అడు గు వేసిందని తెలిపారు. అనంత రం జడ్‌పీ హైస్కూల్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీసీఎం ఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, ము ప్పిడి సురేష్, లంక శ్యామలరావు, కొమరాపు రవి, బెండు మల్లేశ్వర రావు, పిసిని జగన్నాథంనాయుడు, రౌతు శ్రీనివాసరావు, వడ్డాది శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల ఆనందమే లక్ష్యం..
ఇచ్ఛాపురం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవ ర్లలో ఆనందం నింపడమే ప్రభుత్వ లక్ష్యమని విప్, ఎమ్మెల్యే బి.అశోక్ అన్నారు. నియోజకవర్గంలో గల 1083 మంది ఆటోవాలాల బ్యాంక్ ఖాతాల్లో రూ.15వే లు చొప్పున జమ చేసినట్టు తెలిపారు. లొద్దపుట్టి ధన రాజ తులసమ్మతల్లి అమ్మవారి గుడి వద్ద శనివారం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారం భించారు. 100 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట వెంటనే అమలు చేసి ఆటో వాలాలకు అండగా నిలిచారని అన్నారు. ఈమేరకు ఆటో డ్రైవర్లకు చెక్కును అంద జేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్య దర్శులు పత్రి తివిటయ్య, ఎన్.కోటి, మాజీ ఎంపీపీ ఢిల్లీరావు, కాళ్ల ధర్మారావు, కొండా శంకర్‌రెడ్డి, కౌన్సిలర్ కాళ్ల దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
ఆటోడ్రైవర్లకు దసరా నజరానా..
పాతపట్నం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా నజరానా అంది ంచిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆటో డ్రైవర్ల ్లసేవలో పథకాన్ని వర్చువల్ పద్ధతిలో ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గ పరిధిలో మొత్తం 1462 మంది ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే తనయుడు మామిడి సాయుగణేష్ ఆధ్వర్యం లో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వ హించారు. పీఏసీఎస్ అధ్యక్షుడు బండి రవివర్మ, కూటమి నేతలు పైల బాబ్జీ, సలాన మోహన రావు, తూలుగు తిరుపతిరావు, హిరమండలం ఏఎంసీ చైర్మన్ మామిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లకు ఆర్థిక ఊతం..
టెక్కలి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆటోడ్రైవర్లకు కూటమి ప్రభుత్వం ఆర్థిక ంగా ఊతం అందించేం దుకు ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి అన్నారు. శనివారం తెంబూరు రోడ్డు జంక్షన్‌లో ఆటో ర్యాలీని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు థ్యాంక్యూ బా బూ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు చిత్రప టానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, కింజరాపు హరిప్రసాద్, ఎల్ ఎల్ నాయుడు, బగాది శేషగిరి, ఎంవీఐ సంజీవరావు, పినకాన అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.