విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:37 PM
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగానే మెగా డీఎస్సీ ద్వారా వేలాది మంది ఉపాధ్యాయుల నియా మకం చేపట్టిందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు.
ఇచ్ఛాపురం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా భివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తోందని, ఇందు లో భాగంగానే మెగా డీఎస్సీ ద్వారా వేలాది మంది ఉపాధ్యా యుల నియా మకం చేపట్టిందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ అభి నందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రతీ విద్యార్థినీ ఉత్తములుగా తీర్చి దిద్దే బాధ్యతలను ఉపాధ్యాయులు తీసుకోవా లన్నారు. ఎంఈ వోలు అప్పారావు, విశ్వనాథం మాట్లాడుతూ.. ఇచ్ఛాపురం మండలం, మున్సిపల్ పాఠశాలలకు ఎక్కువ ఉపాధ్యాయులను తీసుకురావడంలో ఎమ్మెల్యే అశోక్ విశేషంగా కృషి చేశా రన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఉపాధ్యాయ సంఘాల నేతలు శాలువ కప్పి, బొకేలిచ్చి సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తవిటయ్య, కోటి, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్‌రెడ్డి, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.