సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:18 PM
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.
రణస్థలం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వైద్యం చేసుకున్న 11 మందికి రూ.11.63 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామ లరావు, చౌదరి బాబ్జీ, పిసిని జగన్నాఽథంనాయుడు, పిన్నింటి మధు బాబు, గొర్లె శ్రీహరి పాల్గొన్నారు.