పేదలకు వరం సీఎం సహాయ నిధి
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:00 AM
ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు వరమని, దరఖాస్తు పెట్టుకోగానే భరోసా లభిస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.
శ్రీకాకుళం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు వరమని, దరఖాస్తు పెట్టుకోగానే భరోసా లభిస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శుక్రవారం నగరం లోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. హిరమండలానికి చెందిన సిగడాన ఆనందరావు అనారోగ్యం పాలై కొద్దిరోజుల కిందట మృతిచెందగా ఆ బాధకి తోడు ఆసుపత్రి ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. దీంతో మృతుడి భార్య కేంద్ర మంత్రినికి కలిసి గోడును వెలిబుచ్చారు. ఆయన స్పందించి సీఎంఆర్‌ఎఫ్‌కు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.2,26,028 మంజూరు కాగా ఆ చెక్కును బాధితురాలు అనసూయకు అందించారు. పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
చెక్కును అందజేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు (రామ్మోహన్)