Share News

ఉద్యోగుల బకాయిలపై స్పష్టత ఇవ్వాలి

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:38 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు చెల్లించాల్సిన బకాయి లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారా యణ డిమాండ్‌ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని టీటీడీ కళ్యాణమండపంలో ఉద్యోగుల సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఉద్యోగుల బకాయిలపై స్పష్టత ఇవ్వాలి
మాట్లాడుతున్న సూర్యనారాయణ:

అరసవల్లి, అక్టోబరు 5(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు చెల్లించాల్సిన బకాయి లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారా యణ డిమాండ్‌ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని టీటీడీ కళ్యాణమండపంలో ఉద్యోగుల సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 జూన్‌ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారని, ప్రస్తుతం ఈ బకాయిలు రూ.33వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు.ఇప్పట్లో వాటిని చెల్లించే పరిస్థితులు కూడా కనబడడం లేదని, ఆ బకాయిలను ఎలా చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం ఎంత బకాయి ఉందో సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేసి, ఉద్యోగికి సర్టిఫికెట్‌ రూపంలో అందజేయాలని కోరారు. చెల్లించలేని పక్షంలో ఆ బకాయికి సమానంగా ఏ ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగికి ఆ ప్రాంతంలో భూమిని కేటాయించాలని డిమాండ్‌ చేశారు.ఈ విషయంపైౖ ఉద్యోగులతో 12 అంశాలతో కూడిన సమస్యలపై చర్చించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌ వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిమ్మ సోమేశ్వరరావు, ఎం.సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:38 PM