Share News

సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:04 AM

రామచంద్రాపురం గ్రామానికి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ వాన రాజగోపాలరావు (37) మృతదేహానికి స్వగ్రామంలో ఆదివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
రాజగోపాలరావు మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్న పోలీసు అధికారులు

జలుమూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రామచంద్రాపురం గ్రామానికి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ వాన రాజగోపాలరావు (37) మృతదేహానికి స్వగ్రామంలో ఆదివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిం చారు. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌లో శుక్రవారం సాయంత్రం గుండెపోటుకు గురై మృతిచెందారు. 12 ఏళ్లుగా ఆయన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే రాజగోపాలరావు అకస్మాత్తుగా మృతిచెందడంతో గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాయచూర్‌ నుంచి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చి పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రి యలు చేశారు. మృతుడి తండ్రి ఆదినారాయణ 7 ఏళ్ల క్రితం మృతి చెందగా రాజగోపాలరావే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి తల్లి శకుంతల, భార్య మీనాక్షి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజగోపాలరావు మృతితో స్వగ్రామం రామచంద్రా పురం, అత్తవారి గ్రామం ఎచ్చెర్ల వానిపేటల్లో విషాదఛాయలు అలముకు న్నాయి. అందరితో కలివిడిగా ఉండే రాజగోపా లరావు మృతి చెందిన విషయం తలుసుకుని గ్రామస్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. కుటుంబ పెద్ద మృతితో బంధువులు లబోదబోమంటున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:04 AM