కబళించిన కిడ్నీ వ్యాధి
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:45 AM
తోటూరు గ్రామానికి చెందిన కోనేటి భాస్కరరావు (50) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
- చికిత్స పొందుతూ ఒకరి మృతి
- నెల కిందట అనార్యోగంతో భార్య కూడా..
సోంపేట రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): తోటూరు గ్రామానికి చెందిన కోనేటి భాస్కరరావు (50) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బుధవారం సాయంత్రం మృతి చెందాడు. భాస్కరరావు పలాస కిడ్నీ ఆసుప త్రిలో గత కొద్ది నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. మంగళవారం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేశారు. భాస్కరరావు భార్య గత నెల 24న అనారోగ్య కారణాలతో మృతి చెందింది. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు కిశోర్ మానసిక దివ్యాంగుడు. కుమార్తెకు వివాహమైంది.