Share News

క్రిస్మస్‌ సందడి

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:15 AM

Christmas festival జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలతో పాటు యువకులు, పిల్లలతో సందడి వాతావరణం కనిపించింది. బుధవారం అర్ధరాత్రి నుంచే సంబరాలు చేసుకున్నారు.

క్రిస్మస్‌ సందడి
శ్రీకాకుళం: కీస్టోన్‌ చర్చిలో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు

చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు

పాతశ్రీకాకుళం/ అరసవల్లి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలతో పాటు యువకులు, పిల్లలతో సందడి వాతావరణం కనిపించింది. బుధవారం అర్ధరాత్రి నుంచే సంబరాలు చేసుకున్నారు. హ్యాపీ క్రిస్మస్‌ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వీట్లు, కేకులు పంచిపెట్టారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రపంచానికి జ్ఞానవెలుగును ప్రస రింపజేయాలని ప్రార్థనలు చేశారు. శ్రీకాకుళంలోని క్రిస్టియన్‌ వర్షిప్‌, తెలుగు బాప్టిస్టు, సెయింట్‌ థామస్‌, సెయింట్‌ లూథరన్‌, టీబీసీ, కీస్టోన్‌, ఆర్సీఎం తదితర చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి.. ఏసు గీతా లను ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. శాంతి, కరుణ, ప్రేమకు ప్రతిరూపం ఏసు అని, క్రీస్తు మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఫాదర్లు పిలుపునిచ్చారు.

Updated Date - Dec 26 , 2025 | 12:15 AM