చిట్టివలసను పంచాయతీగా ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:56 PM
పైడిభీమవరం నుంచి చిట్టివలసను విభజించి పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు గుడివాడ నందేశ్వ రరావు, సరగడ రామసూరి, పైడిరాజు, శ్రీన రాజు తదితరులు కోరారు.
రణస్థలం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పైడిభీమవరం నుంచి చిట్టివలసను విభజించి పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు గుడివాడ నందేశ్వ రరావు, సరగడ రామసూరి, పైడిరాజు, శ్రీన రాజు తదితరులు కోరారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును కలిసి వినతపత్రం అం దజేశారు. మాగ్రామం పైడిభీమవరం పంచాయతీలో ఉన్నప్పటికీ భౌగోళికంగా దూరంగా ఉండడంతో పాటు పంచాయతీ కార్యాలయానికి రావడం ఇబ్బంది పడుతున్నామన్నారు. అందువల్ల చిట్టివలసను పంచా యతీగా ఏర్పాటు చేయాలని సరగడపేట, చిల్లపేట గ్రామస్థులు కోరారు.
అర్హులందరికీ పక్కా గృహాలు
ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్నవారంద రికీ పక్కా గృహాలు మంజూరు చేస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. శనివారం స్థానిక టీడీపీ కార్యా లయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కావేదిక నిర్వహించారు. ఇళ్ల స్థలాలు మంజూరు, గృహ నిర్మాణం, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, రోడ్లు, విద్యుత్ దీపాలు, మురుగు కాలువల నిర్మాణం, పాసు పుస్తకాల మార్పిడి వంటి సమస్యలపై 25 వినతులు అందాయి. కార్యక్రమంలో పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటి నుంచి ప్రజలు వినతులు పెట్టుకున్నారు.
పార్టీలకతీతంగా ఆదుకుంటాం
పాతపట్నం/ మెళియాపుట్టి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పార్టీలకు అతీ తంగా పేదోడిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో రూ.96,309 విలువ చేసే రెండు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బాధితులకు శనివారం పంపిణీ అందజేశారు. హిరమండలం శుభలయి ఆర్‌ఆర్ కాలనీకు చెందిన బలగ ప్రభావతికి రూ.40 వేలు మెళియాపుట్టి మండలం సుందరాడ పంచాయతీ అప్పోజీపేట గ్రామానికి చెందిన సవర షన్ముఖరావుకు రూ.56,309 చొప్పున్న మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ముగిసిన గ్రిగ్స్ పోటీలు
పోలాకి, డిసెం బరు 13(ఆంధ్రజ్యోతి): మబగాం ఉన్నత పాఠశాల మైదానంలో గత మూడు రోజులు గా జరుగుతున్న గ్రిగ్స్ పోటీలు శనివారంతో ము గిశాయి. విజేత లకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బహుమతులు అందచేశారు. నాలుగు మండలాల నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మణరావు, ఎం.నీలం తెలిపారు. కార్యక్రమంలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల నుంచి వచ్చిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, కేజీబీవీ, ఈదులవలస మోడల్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.