బాలికా సంరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:49 PM
బాలికా సంరక్షణ అందరి బాధ్యత అని డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): బాలికా సంరక్షణ అందరి బాధ్యత అని డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో మా ట్లాడుతూ.. అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా బాలి కలు, స్త్రీలకు ఉన్న హక్కులు, బాధ్యలపై అవగాహన కలిగిం చాలన్నారు. ఉప కలెక్టర్ పద్మావతి ప్రతిజ్ఞ చేయించారు. అనం తరం పోస్టర్‌ను విడుదల చేశారు. పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేసే పోస్టర్లను కూడా ఆవిష్క రించా రు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.అనిత, డీసీహెచ్‌ఎస్ డా.కల్యాణ బాబు తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
శ్రీకాకుళం లీగల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): బాల్య వివా హాలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. స్థానిక వికాస్ పాఠశాలలో సోమవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలవల్ల బాలికల ఆరోగ్యం పూర్తిగా పాడయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవా లన్నారు. కార్యక్రమంలో న్యాయ వాది గేదెల ఇందిరాప్రసాద్, పాఠశాల డైరెక్టర్ కె.వేణుగోపాల్, కె.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
హక్కులు తెలుసుకోవాలి
రణస్థలం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెప్పలవలస ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలి కల దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. బాలి కల హక్కులు, బాధ్యతలను హెచ్‌ఎం జయదేవి వివరించారు. కార్యక్ర మంలో ఎంఎస్‌కే చైర్‌పర్సన్ సుగ్గు కామేశ్వరి, సెక్రటరీ బల్ల రాజేశ్వరి, పీఈటీ దాలి నాయుడు తదిత రులు పాల్గొన్నారు.