బాల్య వివాహాలను నియంత్రించాలి
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:54 PM
బాల్య వివాహాలను నియంత్రించాలని సర్వశిక్షా అభియాన్ ఏపీసీ శశి భూషణ్ అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను నియంత్రించాలని సర్వశిక్షా అభియాన్ ఏపీసీ శశి భూషణ్ అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సంద ర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ప్రధాన మార్గాల్లో విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఐసీడీ ఎస్ పీడీ ఐ.విమల మాట్లాడుతూ జిల్లాలో బాలికా సంర క్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సూర్య మహల్ కూడలి వద్ద మానవహారం నిర్వ హించారు. బాలికల రక్షణకు మద్దతుగా పాల్గొన్న వారితో సంతకాల సేకరణ చేపట్టారు. విద్యార్థి నులకు వ్యాసరచన, డ్రాయింగ్, సాంస్కృ తిక పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అంద జేశారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ శ్రీలక్ష్మి, బాలల రక్షణ అధికారి కేవీ రమణ, మిషన్ కోఆర్డినేటర్ డి.ఉమామహేశ్వరి, నోడల్ అధికారి కె.మణెమ్మ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.సూర్యచంద్రరావు, ప్రభు త్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు.