Share News

బాల్య వివాహాలు అనర్థదాయకం

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:23 AM

బాల్య వివాహాలు నమాజానికే అనర్థదాయకం అని జిల్లా ప్రధాన న్యాయాధికారి జూనైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు.

 బాల్య వివాహాలు అనర్థదాయకం
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

శ్రీకాకుళం లీగల్‌, డిసెంబరు22 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు నమాజానికే అనర్థదాయకం అని జిల్లా న్యాయాధికారి జూనైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. సోమవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై పారా లీగల్‌ వలంటీర్లు, ప్యానల్‌ న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొన్నిచోట్ల ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ మేరకు బ్రోచర్లు, వాల్‌ పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లాన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, న్యాయవాదులు గేదెల వాసుదేవరావు, వాడపల్లి జోతిర్మయి, వి.హరిప్రియ, పారా లీగల్‌ వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Dec 23 , 2025 | 12:23 AM