బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:18 PM
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని టెక్కలి కోర్టు సివిల్ సీనియర్ న్యాయాధికారి బి.నిర్మల తెలిపారు.
టెక్కలి రూరల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని టెక్కలి కోర్టు సివిల్ సీనియర్ న్యాయాధికారి బి.నిర్మల తెలిపారు. శనివారం మొఖలింగపురంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తా యన్నారు. దీని పై ప్రతి ఒక్కరూ అవ గాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రఘునాఽథరావు, బార్ అసోసియేషన్ చైర్మన్ పినకాన అజయ్‌కుమార్, వైద్యా ధికారి ధనలక్ష్మి, ఐటీడీఎస్ సూపర్‌వైజర్ సంధ్యారాణి, సర్పంచ్ రాకేష్, తదితరులు ఉన్నారు.
బాల్య వివాహాలపై కోర్టును ఆశ్రయించాలి
ఇచ్ఛాపురం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): బాల్య వివా హాలు చట్టరీత్యా నేరమని జూనియర్ సివిల్ న్యాయాధి కారి పి.ఫరీష్‌కుమార్ అన్నారు. శనివారం బాలికోన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలకు తల్లిదం డ్రులు బలవంతపు బాల్య వివాహాలు చేసేందుకు నిర్ణ యిస్తే కోర్టును ఆశ్రయించాలని, మీరు న్యాయం చేయ డంతో పాటు తల్లిదండ్రులకు నష్టం జరగకుండా అవ గాహన కలిగిస్తామన్నారు. చిన్నవయసులో వివాహాల వల్ల శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతా యన్నారు. చదువులపైనే దృష్టి సారించాలని, దీనికి తల్లి దం డ్రులు సహకరించాలన్నారు. కార్యక్ర మంలో సీఐ మీసాల చిన్నమనాయుడు, ఎస్‌ఐలు ముకుందరావు, శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సోమశేఖర్‌రెడ్డి, జి.కామేష్, పలువురు న్యాయవాదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధితోనే విజ్ఞానం
హరిపురం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఏజెన్పీలోని మారుమూల గ్రామాల్లో విద్యాభి వృద్ధి చెందితేనే ప్రజల్లో విజ్ఞానం లభిస్తుందని సోంపేట కోర్టు ఆరవ అదనపు న్యాయాధికారి కె.కిశోర్‌బాబు అన్నారు. మందస ఏజెన్సీ లోని పాతకోట, బుడంబో గ్రామాల్లో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతో కలిగే లాభాలను వివ రించారు. కార్యక్రమంలో సీఐ తిరుపతిరావు, న్యాయ వాదులు కె.కృష్ణమోహన్, ఎంసీహెచ్ శ్రీనివాస రావు, జగదీష్ పండా, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్, ఎంఈవో ఎం. లక్ష్మణరావు, ఎంఎల్‌ఎస్‌ఎస్ సిబ్బంది సుజాత, పీటర్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
కొత్తూరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జూని యర్ సివిల్ న్యాయాధికారి కందికట్ట రాణి సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. చెడు అలవా ట్లకు లోనవకుండా చదువుపైనే దృష్టి సారించాలని సూ చించారు. కార్యక్రమంలో సీఐ చింతాడ ప్రసాద్, ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.