Share News

చెరువులా ఆర్టీసీ కాంప్లెక్స్‌

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:29 AM

చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు.. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ చెరవును తలపిస్తుంది.

చెరువులా ఆర్టీసీ కాంప్లెక్స్‌
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పరిస్థితి..

  • వర్షం, మురుగునీటితో జలమయం

శ్రీకాకుళం, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు.. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ చెరవును తలపిస్తుంది. ఈ నీరు వెళ్లేవరకు ప్రయాణికుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. గురువారం వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు విరగ కాచిన ఎండతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం 3.30 గంటల నుంచి వర్షం కురిసింది. ఆపై పిడుగుల మోత.. ఈదురుగాలులు మొదలయ్యాయి. నగరంలో ఆర్ట్స్‌ కళాశాల మైదానం, కేఆర్‌ స్టేడియంలో నీరు చేరిపోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ జలమయమైంది. సమీపంలోని మురుగు కాలువల్లోని నీరు కూడా చేరిపోయింది. దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందలు పడ్డారు. నీటిలోనే బస్సులు ఎక్కాల్సి వచ్చింది. ఇక ద్విచక్రవాహనదారులు అవస్థలు అన్నీ ఇన్నీకావు.

Updated Date - Jun 06 , 2025 | 12:29 AM