ఆరు వారాల్లో చెక్ డ్యామ్‌లు పూర్తి కావాలి
ABN , Publish Date - May 20 , 2025 | 12:20 AM
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపడు తున్న చెక్‌డ్యామ్‌లు, చెరువుల పనులు ఆరు వారాల్లో పూర్తి కావాలని కలెక్టర్ ఏ.శ్యాంప్ర సాద్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
పార్వతీపురం, మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపడు తున్న చెక్‌డ్యామ్‌లు, చెరువుల పనులు ఆరు వారాల్లో పూర్తి కావాలని కలెక్టర్ ఏ.శ్యాంప్ర సాద్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో సోమవారం జలవనరుల శాఖ పనులపై సమీక్షించారు. జిల్లాలో 39 చెక్‌డ్యామ్ లు, 122 చెరువులు, 40 ఇతర పనులను చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చినట్టు చెప్పారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ఈలో గా పనులను పూర్తి చేయాలన్నారు. మంజూరు చేసిన పనులన్నీ ఆరు వారాల్లో పూర్తి చేయాల ని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో చర్చించి త్వరగా పనులను ప్రారంభించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీలో జిల్లాకు కేటాయించిన రూ.210 కోట్ల నిధుల్లో ప్రప్రథ మంగా జల వనరుల శాఖ పనులకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని, తద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పనులు చేపట్టేందుకు ముందు కు వచ్చిన కాంట్రాక్టర్లతో త్వరగా పనులు ప్రారంభించి చేయాలన్నారు. సాలూరు, మక్కు వ, పాచిపెంట మండలాల్లో ఒక్కపనికూడా ప్రారంభం కాలేదని, దీనిపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఎంత త్వరగా పనులు పూర్తి చేస్తే అంత త్వరగా నిధులు విడుదల అవుతాయని, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. సమావేశంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచం ద్రరావు, జల వనరులశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్.అప్పలనాయుడు, సహాయ ఇంజనీర్లు, జూనియర్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
పీఎం జన్మన్ పనులు గ్రౌండింగ్ కావాలి..
జిల్లాలో పీఎం జన్మన్ పథకం కింద నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులు మరింత వేగవంతం కావాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు గ్రౌండింగ్ కాని గృహాలను వెంటనే గ్రౌడింగ్ చేయాలని, మొత్తంగా పీఎం జన్మన్ పనులు జిల్లాలో బాగా జరగాలని కలెక్టర్ సూచించారు. సోమవారం తన కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత కార్యక్రమాలైన పీఎం జన్మన్, పీఎం సూర్యఘర్ పథకాలలో మరింత వేగం కనిపించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శోబిక, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కెఆర్‌ఆర్‌సి ప్రత్యేక ఉపకలెక్టర్ డాక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డిఆర్‌డిఏ పిడి ఎం.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.