గ్రాట్యూటీ జీవోలో మార్పులు చేయాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:33 PM
అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు.
హిరమండలం, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి):అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. మంగళ వారం హిరమండలంలో ఏపీ అంగన్‌వాడీ వర్కర్,హెల్పర్స్ యూనియన్ కొత్తూరు ప్రాజెక్టు మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రాట్యూటీ జీవోలో మార్పులుచేయాలని కోరారు.హెల్పర్ల ప్రమోషన్లకు విధివిధానాలు రూపొం దించాలన్నారు.ఈసందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కొత్తూరు ప్రాజక్టు కమిటీ అధ్యక్షురాలిగా కె.లక్మి, గౌరవాధ్యక్షులిగా ఆర్.పద్మరాణి, ప్రధానకార్యదర్శిగా కేవీహేమలత, ఉపాధ్యక్షులు,సహాకార్యదర్శులుగా ఎం.సుదీష్ణ,ఆర్.అరుణలతో పాటు 25 మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాదరావు పాల్గొన్నారు.