Share News

రాష్ట్ర యోగా పోటీలో చంద్రశేఖర్‌కు మూడోస్థానం

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:30 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా సోలో సాంగ్‌ పోటీలో యోగా గురువు గేదెల చంద్రశేఖరరెడ్డి మూడో స్థానం సాధించారు.

రాష్ట్ర యోగా పోటీలో చంద్రశేఖర్‌కు మూడోస్థానం
టెక్కలి: చంద్రశేఖరరెడ్డికి బహుమతి అందిస్తున్న రాష్ట్రమంత్రులు సత్యకుమార్‌, దుర్గేష్‌

టెక్కలి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా సోలో సాంగ్‌ పోటీలో యోగా గురువు గేదెల చంద్రశేఖరరెడ్డి మూడో స్థానం సాధించారు. ఈ మేరకు బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చంద్ర శేఖర్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్‌ బహుమతులు అందించి అభినందించారు. రూ.20వేల నగ దు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను బహూకరించారు.

డిగ్రీ కళాశాలలో యోగాంధ్ర

టెక్కలి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సామూహిక యోగాసనాలు వేశారు. ప్రిన్సిపాల్‌ టి.గోవిందమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యోగా సనాల ప్రాముఖ్యతపై అధ్యాపకుడు కోటేశ్వరరావు అవగాహన కల్పించారు. కార్య క్రమంలో వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సతీష్‌కుమార్‌, లూక్‌పాల్‌, వాసుబాబు, డాక్టర్‌ పీవీఎన్‌ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

యోగాపై అవగాహన ర్యాలీ

నరసన్నపేట, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21 ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధులు బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా.లత, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:30 PM