Share News

చంద్రన్నా.. సుఖీభవ

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:03 AM

Farmers' victory rally with tractors ‘అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా చంద్రన్న పాలన కొనసాగుతోంద’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను మంజూరు చేయడంతో సోమవారం స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

చంద్రన్నా.. సుఖీభవ
ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రైతులు

నరసన్నపేటలో ట్రాక్టర్లతో రైతుల విజయోత్సవ ర్యాలీ

అన్నదాతకు అండగా కూటమి పాలన: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ‘అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా చంద్రన్న పాలన కొనసాగుతోంద’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను మంజూరు చేయడంతో సోమవారం స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 ట్రాక్టర్లతో స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయం నుంచి సత్యవరం జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ‘చంద్రన్నా.. సుఖీభవ’ అంటూ హోరెత్తించారు. ఎన్నికల హామీ నిలబెట్టుకుని అన్నదాత సుఖీభవ పథకం కింద తొలివిడతగా రూ.7వేలు చొప్పున జమ చేసిన సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో రైతులు అడుగుడునా దగా పడ్డారు. అన్నదాతకు ఇచ్చిన మాట మేరకు సీఎం చంద్రబాబునాయుడు ధాన్యం కొనుగోలు సమయంలో 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. వరి, అరటి, మామిడి, మొక్కజొన్న సాగు చేసిన రైతులను ఆదుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ పథకం అమలుతో రైతుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామ’ని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు పోగోటి ఉమామహేశ్వరి, బలరాం, నరసన్నపేట, చల్లపేట, అల్లాడ, పోలాకి పీఏసీఎస్‌ల అధ్యక్షులు ఇసా అప్పారావు, దుంగ స్వామిబాబు, వెలమల చంద్రభూషణరావు, బైరి భాస్కరరావు, రాష్ట్రకాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు శిమ్మ చంద్రశేఖర్‌, ఎంవీ నాయుడు, వెలమల రాజేంద్రనాయుడు, కత్తిరి వెంకటరమణ, మెండ రాంబాబు, అడపా చంద్రశేఖర్‌, శిమ్మ లక్ష్మణరావు, చిట్టి సింహాచలం పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 12:03 AM