రైతుల సేవలో చంద్రన్న ప్రభుత్వం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:10 AM
రాష్ట్రంలోని రైతాంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సేవగా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.

సరుబుజ్జిలి, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతాంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సేవగా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. మండల కేంద్రమైన సరుబుజ్జిలి జంక్షన్‌లో కొత్తకోట సహకార సంఘం ఆధ్వర్యంలో సుమారు రూ.40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గిడ్డంగి గోదామును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ.. 2019 సంవత్సరం వరకు లాభాల్లో ఉన్న కొత్తకోట సహకార సంఘాన్ని వైసీపీ పాలకులు నష్టాలోకి తీసుకెళ్లారన్నారు. ఈ గోదామును అద్దెకు అప్పగించి నిధులు సమకూర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, ఏపీటీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే నందికొండ ప్రాథమిక పాఠశాల నుంచి సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి బదిలీ చేసిన ఉపాధ్యాయుడు బి.శ్రీనివాసరావును తిరిగి ఇదే పాఠశాలకు కేటాయించాలని ఆ గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే రవికుమార్‌కు కోరారు.