చంద్రబాబు పాలన ఆదర్శం
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:03 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుది ఆదర్శ పాలనని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
రణస్థలం, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుది ఆదర్శ పాలనని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఇచ్చిన హామి నిలబెట్టుకొని ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తించేలా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారన్నారు. శుక్రవారం సాయంత్రం ముఖ్య మంత్రి చంద్రబాబు చిత్ర పటానికి లబ్ధిదారులతో పాలభిషేకం చేశారు. సూపర్ సిక్స్ అమలు చేసిన ఘనత చంద్రబాబునాయుడిదే అన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన బాధాకరమని, ఈ తరుణంలో వైసీపీ నేతల తీరు రాక్షసులను తలపిస్తోందని విమర్శించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు లంక శ్యామలరావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.