పాతపట్నంలో చైన్ స్నాచింగ్ కలకలం
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:18 AM
స్థానిక నీలకంఠే శ్వరుని ఆలయ సమీపంలో ఓ మహిళ మెడలోని పుస్తెలు తాడు తెంపుకుపోయిన ఘటన మంగళవారం మధ్యాహ్నం పాతపట్నంలో కలకలం రేపింది.
పాతపట్నం, జూలై 29(ఆంధ్రజ్యోతి): స్థానిక నీలకంఠే శ్వరుని ఆలయ సమీపంలో ఓ మహిళ మెడలోని పుస్తెలు తాడు తెంపుకుపోయిన ఘటన మంగళవారం మధ్యాహ్నం పాతపట్నంలో కలకలం రేపింది. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల మేరకు.. పాతపట్నం కోటగుడ్డి కాలనీకు చెందిన కాళ్ల జ్యోతి స్థానిక నీలకంఠేశ్వర ఆలయ చేరువలో ఉన్న పశువులశాల వద్ద పనులు చేసుకుంటుంది. మంగళ వారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు వచ్చి మంచినీరు ఇవ్వాలని జ్యోతిని అడి గారు. పక్కనే ఉన్న ఆలయంలో వద్దకు వెళ్లమని చెప్పింది. పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ఒక్క ఉదుటన ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తులతాడు తెంపుకుని కాపుగోపాలపురం మీదుగా పర్లాకిమిడివైపు బైక్‌పై ఉడా యించారు. బాధితురాలు తేరుకుని కేకలు వేయగా.. కాస్త దూరంలో ఉన్న కొంత మంది వచ్చి విషయం తెలుసుకుని బైక్‌పై వెంబడించినా వారి ఆచూకీ తెలియ రాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరిశరాల్లో ఉన్న సీసీ ఫేటేజీలను పరిశీలిస్తున్నారు. జ్యోతి ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ బి.లావణ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.