Share News

సీజీఎఫ్‌ నిధుల మంజూరు

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:35 PM

ww

 సీజీఎఫ్‌ నిధుల మంజూరు
సీజిఎఫ్‌ నిధుల మంజూరుపత్రాన్ని శ్యామలాపురం గ్రామపెద్దలకు అందజేస్తున్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు:

పాతపట్నం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఎన్‌పేట మండలంలోని శ్యామ లాపురంలోగల రాధాగోవిందస్వామి ఆలయాభివృద్ధికి రూ.20లక్షల కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) నిధులు మంజూరయ్యాయని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. సంబంధిత నిధుల మంజూరు పత్రాలను ఆగ్రామపెద్దలకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన నిధులతో భక్తులకు అవసరమయ్యే సౌకర్యాల కల్పన, శుభ్రత, ఆలయపరిసరాల్లో ఆధునిక సౌకర్యాల కల్పన, పండగలనిర్వాహణకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని సూచించారు.

Updated Date - Dec 11 , 2025 | 11:36 PM