తర్లాకోటలో శ్మశానం పరిశీలన
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:51 PM
మండలంలోని తర్లాకోట సంస్థానా ధీశులకు చెందిన శ్మశాన భూమిని తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు స్థలం పరిశీలించారు.
పలాసరూరల్, జూలై24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తర్లాకోట సంస్థానా ధీశులకు చెందిన శ్మశాన భూమిని తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు స్థలం పరిశీలించారు.గురువారం శ్మాశానాన్నీ వదల్లే శీర్షికతో ఆంధ్రజ్యోతి కథనం ప్రచురితంకావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. ఎంత మేర ఆక్రమణ జరిగింది, ఆ స్థలాలు ఎవరి ద్వారా వారికి దాఖలుపడ్డాయో పూర్తివివరాలు సేకరించాలని, ఎవరి వద్దైనా కొనుగోలు చేశారా, లేక ఆక్రమించారా అన్న వివరాలను అందజేయాలని వీఆర్వో, సర్వేయరుకు తహసీల్దార్ ఆదేశించారు.