స్నేహితుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:50 PM
బప్పడాం గ్రామంలో గురువారం రాత్రి సెల్‌ఫోన్ కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
గొడవ.. పరస్పరం దాడులు.. ఒకరి పరిస్థితి విషమం
సరుబుజ్జిలి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): బప్పడాం గ్రామంలో గురువారం రాత్రి సెల్‌ఫోన్ కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సరుబుజ్జిలి ఎస్‌ఐ బి.హైమవతి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. నందికొండ గ్రామానికి చెందిన పల్లి వీరవెంకట దుర్గాప్రసాద్ బప్పడాం గ్రామా నికి చెందిన పేడాడ శ్రీధర్ మంచి స్నేహితులు. ఇటీవల దుర్గాప్రసాద్ సెల్‌ఫోన్ ను శ్రీధర్ తీసుకున్నారు. అతడి వద్ద ఉన్నఫోన్ తిరిగి ఇవ్వాలని దుర్గాప్రసాద్ అడగడంతో.. అమృత లింగానగరం వద్ద ఉన్న పాలకేంద్రం వద్దకు రావాలని శ్రీధర్ ఫోన్‌లో చెప్పాడు. గురువారం రాత్రి దుర్గాప్రసాద్ మరో వ్యక్తిని తీసుకొని అక్కడికి వెళ్లగా గ్రామంలోని తన ఇంటి వద్దకు రావాలని శ్రీధర్ చెప్పడంతో ముగ్గురూ కలిసి బప్పడాం వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య మాటా మాటా పెరి గి కొట్లాటకు దారి తీసింది. ఈ క్రమంలో దుర్గాప్రసాద్ ముఖం, రెండు చేతులు, ఛాతీపై శ్రీధర్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరచగా.. పక్కనే ఉన్న పొలం లో పడిపోయాడు. దీంతో శ్రీధర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దుర్గాప్రసాద్ తోపాటు వచ్చిన వ్యక్తి ఈ హఠాత్తు పరిణామమం నుంచి తేరుకుని కుటుంబ స భ్యులకు విషయం చెప్పాడు. వెంటనేవారు గ్రామస్థులకు, పోలీసులకు సమాచా రం ఇచ్చారు. దీంతో ఆమదాల వలస సీఐ పి.సత్యనారాయణ, ఎస్‌ఐ బి.హైమా వతి గ్రామానికి చేరుకుని పరిశీ లించారు. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్‌ను 108లో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు శ్రీధర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.