ఉత్సాహంగా సంబరాలు
ABN , Publish Date - May 25 , 2025 | 11:28 PM
కవిటి, జగతి గ్రామాల్లోని గ్రామదేవతలకు ఆదివారం ఆ యా గ్రామస్థులు సంబరాలను నిర్వహించారు.
కవిటి, మే 25(ఆంధ్రజ్యోతి): కవిటి, జగతి గ్రామాల్లోని గ్రామదేవతలకు ఆదివారం ఆ యా గ్రామస్థులు సంబరాలను నిర్వహించారు. రామయ్యపుట్టుగలోని గోష్టి సంఘం ఆధ్వ ర్యంలో చింతామణి అమ్మవారికి సంబరాన్ని చేపట్టారు. జగతిలోని మర్లపోలమ్మతల్లి ఉత్స వాన్ని గ్రామస్థుల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. గజముద్దలు, కాళికావేషధారణలతో సాం స్కృతిక ప్రదర్శనలతో ఊరేగింపు చేపట్టి ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఇచ్ఛాపురం, మే 25(ఆంధ్రజ్యోతి): ధనరాజ తులసమ్మతల్లి సంబరాన్ని పట్టణ పరిధిలో పలు వీధుల్లో ప్రజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారి ఘటాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు. బిందెలతో తీసుకెళ్లిన పసుపు నీళ్లు, పానకాలతో అమ్మవారికి అభిషేకాలు జరిపించారు.