Share News

బ్రాహ్మణతర్లా వద్ద పొదల్లో చిక్కుకుని..

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:30 AM

పలాస మండలం కే దారిపురం వద్ద వరహాలగెడ్డలో బు ధవారం మధ్యాహ్నం గల్లంతైన వ్య క్తి మృతదేహం గురువారం సాయం త్రం నాటికి బ్రాహ్మణతర్లా ప్రధాన గెడ్డ అయిన వరహాలగెడ్డలో లభ్య మైంది.

బ్రాహ్మణతర్లా వద్ద పొదల్లో చిక్కుకుని..
పొదల్లో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీస్తున్న దృశ్యం, ఇన్‌సెట్‌లో లావణ్య(ఫైల్‌)

  • వరహాల గెడ్డలో గల్లంతైన వ్యక్తి మృతదేహం గుర్తింపు

పలాస రూరల్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పలాస మండలం కే దారిపురం వద్ద వరహాలగెడ్డలో బు ధవారం మధ్యాహ్నం గల్లంతైన వ్య క్తి మృతదేహం గురువారం సాయం త్రం నాటికి బ్రాహ్మణతర్లా ప్రధాన గెడ్డ అయిన వరహాలగెడ్డలో లభ్య మైంది. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం కేదారిపురం వరహాలగెడ్డ లో చేపల వేటకు వెళ్లిన దానగొర గ్రామానికి చెందిన సవర లావణ్య (38) గల్లంతయ్యాడు. స్థానికు లు ఆ ప్రాంతంలో వెదికి నా లావణ్య ఆచూకీ ల భ్యం కాలేదు. దీంతో ఎన్డీ ఆర్‌ఎఫ్‌ బృందం బుధ వారం సాయంత్రం నుం చి రెండు ప్రత్యేక బోట్లలో అర్ధరాత్రి వరకూ వెతికినా ఫలితం లేకపోయింది. గురువారం సాయంత్రానికి బ్రాహ్మణతర్లా వద్ద గెడ్డలోని నీటి పంపుల గల పొదల్లో చిక్కు కుని ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సాయంతో సవర లావణ్య మృతదేహాన్ని అతి కష్టమీద బయటకు తీశారు. సమాచారం అందుకున్న కాశీ బుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు. నిరుపేదైన లావణ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు. ట్రాక్టరు డ్రైవర్‌గా పనిచేస్తున్న లావణ్య అర్ధాంతరంగా మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. లావణ్యకు భార్య అన్నెమ్మ ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:30 AM