Share News

పశువుల షెడ్‌ దగ్ధం

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:02 AM

పాతర్లపల్లి పంచాయతీ వేంకటేశ్వర కాలనీలో పిన్నింటి అప్పలనాయుడుకు చెందిన పశువుల షెడ్‌ సోమవారం రాత్రి అగ్నికి ఆహుతైంది.

 పశువుల షెడ్‌ దగ్ధం

- రెండు ఆవులు, రెండు దూడలు సజీవ దహనం

రణస్థలం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పాతర్లపల్లి పంచాయతీ వేంకటేశ్వర కాలనీలో పిన్నింటి అప్పలనాయుడుకు చెందిన పశువుల షెడ్‌ సోమవారం రాత్రి అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో నాలుగు పశువులు మృత్యువాత పడ్డాయి. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అందరూ నిద్రలో ఉన్న సమయంలో అర్థరాత్రి పశువుల షెడ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదానికి రెండు ఆవులు, రెండు దూడలు అగ్నికి ఆహుతయ్యాయి. షెడ్‌లో ఉన్న ఆటో, స్కూటీ దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదని, తీవ్రంగా నష్టపోయానని బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. బాధిత కుటుంబానికి మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితుడు పిన్నింటి సాయి, సర్పంచ్‌ గొర్లె రాధాకృష్ణ మంగళవారం పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం కోసం కృషి చేస్తామన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:02 AM