లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:41 PM
రాజీ పడదగ్గ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని జిల్లా ఆరో అదనపు న్యాయాధికారి కె.కిశోర్‌బాబు కోరారు.
సోంపేట, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాజీ పడదగ్గ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని జిల్లా ఆరో అదనపు న్యాయాధికారి కె.కిశోర్‌బాబు కోరారు. కోర్టు ప్రాంగణంలో బార్ అసోసి యేషన్ సభ్యు లు, పోలీసులు, న్యాయ వాదులతో సోమవారం సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో ఇరు పక్షాలను ఒప్పించి రాజీ చేయించు కోవాలని కోరారు. సమావేశంలో సీనియర్, జూనియర్ సివిల్ న్యాయాధికారులు జె.శ్రీనివాసరావు, కె.శ్రీని వాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీఎస్ శైలేంద్ర, డీఎస్పీ వెంకటప్పారావు, సీఐ లవరాజు తదితరులు పాల్గొన్నారు.