బెల్టు షాపుల నిర్వాహకులపై కేసులు
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:42 PM
సారవకోట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది బెల్టు షాపుల నిర్వాహకులపై బెండోవర్ కేసులు నమోదు చేసినట్లు పాతపట్నం ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు.
పాతపట్నం, నవంబరు1(ఆంధ్రజ్యోతి): సారవకోట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది బెల్టు షాపుల నిర్వాహకులపై బెండోవర్ కేసులు నమోదు చేసినట్లు పాతపట్నం ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 మందిని సారవకోట తహసీల్దార్ విజయ లక్ష్మి ఎదుట హాజరుపరిచనట్లు చెప్పారు. వారికి మంచి ప్రవర్తనను ఆశిస్తూ ఏడాది పాటు రూ.2లక్షల బైండోవర్‌ను విధించారని తెలిపారు. మార్పురాకుంటే రూ.2లక్షలు జరిమానా విధించడమే కాకుండా వారిని రిమాండ్‌కు తరలిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకూ సారవకోట మండలంలో 40మంది బెల్టు నిర్వాహకులను, పాతపట్నం మండ లంలో 23మందిని బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మద్యం అందించడమే ధ్యేయంగా ఎక్సైజ్‌శాఖ పనిచేస్తుందని తెలిపారు.