నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసు నమోదు
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:18 PM
నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు దుకాణం సీజ్‌చేయటం జరుగుతుందని ఏడీఏ టి.భవానీ శంకర్ అన్నారు.
ఇచ్ఛాపురం, జూలై 16(ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు దుకాణం సీజ్‌చేయటం జరుగుతుందని ఏడీఏ టి.భవానీ శంకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీచేశారు. ఎరువులు, బిల్లులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించే ధరలకే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తేచర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఏవో అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
పంటల బీమా నమోదు చేసుకోవాలి
కంచిలి, జూలై 16(ఆంధ్రజ్యోతి): వరి సాగుచేసే రైతులు ఎకరాకు రూ.160 చెల్లించి బీమా చేసుకోవాలని వ్యవసాయశాఖ ఏడీ భవానీ శంకర్ కోరారు. భొగాబెణి, కత్తివరం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల బీమా చేయించుకోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో బీమా వర్తించి నష్టపరి హారం అందుతుందన్నారు. ఎద రైతులు పంటలో నవధాన్యాలు వేయడం వల్ల కలుపు నివారణతో పాటు నేల సారవంతమవుతుందన్నారు. అలాగే పంటకు చీడపీడల బారినుంచి రక్షించుకో వచ్చన్నారు. అనంతరం ఎద సాగు చేస్తున్న రైతులకు నవధాన్యాల కిట్లు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి కొంకేన సురేష్, విశ్వేశ్వరరావు, మండల యాంకర్ టి.శివానందం, పలువురు రైతులు పాల్గొన్నారు.