కొట్లాట కేసులో ఆరుగురిపై కేసు నమోదు
ABN , Publish Date - May 26 , 2025 | 11:43 PM
గరుడుభద్ర గ్రామంలో ఆది వారం సాయంత్రం జరిగిన కొట్లాట కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.నిహార్ సోమవారం తెలిపారు.
వజ్రపుకొత్తూరు, మే 26(ఆంధ్రజ్యోతి): గరుడుభద్ర గ్రామంలో ఆది వారం సాయంత్రం జరిగిన కొట్లాట కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.నిహార్ సోమవారం తెలిపారు. ఆ వివ రాలిలా ఉన్నా యి.. గరుడుభద్ర గ్రామంలో తుఫాన్ రక్షిత భవనం సమీపంలోని ప్రభు త్వం స్థలంలో గూడ ధనరాజు ఆవులశాల వేస్తుండడంతో స్థానిక టీడీపీ నాయకులు కొంచాడ మోహనరావు, రెయ్య విజయలక్ష్మి, ధర్మారావు, కూర్మారావు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గూడ ధనరాజుతోపాటు మరికొంతమంది టీడీపీ శ్రేణులపై కర్రలతో దాడి చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గౌడ ధనరాజు, లక్ష్మి, సిద్దూ, సుధాకర్, భాస్కర రావు, జగ్గారావులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నిహార్ తెలిపారు.
కార్పెంటర్ అదృశ్యం
శ్రీకాకుళం రూరల్, మే 26(ఆంధ్రజ్యోతి): ఒప్పంగి గ్రామానికి చెందిన కార్పెంటర్ అదృశ్యమైనట్టు రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒప్పంగి గ్రామంలో కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్న ధమరసింగు సతీష్‌కుమార్(30) ఈ నెల 24 నుంచి కనిపించట్లేదు. ఓ వ్యక్తి నుంచి కొంత నగదు తీసుకుని.. తిరిగి ఆ డబ్బు లు చెల్లించలేకపోవడం.. ఆ ఒత్తిడితో ఇంటి నుంచి బయటకువెళ్లి.. అప్పటి నుంచి అతడి జాడలేదు. అయితే అదే రోజున.. ‘పిల్లలను జాగ్రత్తగా చూసుకో అంటూ.. గడ్డి మందు తాగాను..’ అని వాయిస్ మెసేజ్‌ను తన భార్య జానకి సెల్‌ఫోన్‌కు పంపారు. అప్పటినుంచి సతీష్‌కుమార్ జాడ లేదు. స్థానికంగా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య జానకి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
శ్రీకాకుళం క్రైం, మే 26(ఆంధ్రజ్యోతి): నగరంలోని పీఎన్ కాలనీలో జీరో లైన్‌ని ఓ ఇంటిలో ఈ నెల 15న జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తు లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు టూటౌన్ పోలీసులు సోమవారం తెలిపారు. ఈ నెల 15న పీఎన్‌కాలనీకి చెందిన గురుగుబిల్లి నందిని తన భర్తతో మామిడికాయలు లోడ్‌కు వెళ్లి తిరిగి రా త్రి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తెరిచి ఉండడంతో ఇంటిలోకి వెళ్లి చూడగా సోనీ ఎల్‌ఈడీ టీవీ, శ్యాంసంగ్ ట్యాబ్, రూ.50 వేలు నగదు, చెవి రింగు లు ఒక జత, వెండి పట్టీలు ఒక జత పోయాయని నిర్ధారించుకొని రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టూటౌన్ ఎస్‌ఐ సంతో ష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి.. జీరు సురేష్, బస మణిభూషణ రావులను అరెస్టు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
రణస్థలం, మే 26(ఆంధ్రజ్యోతి): దన్నానపేట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ నగరం చింతపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రణస్థలం నుంచి చింతపల్లి గ్రామా నికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఎస్.బుల్లుబాబు, బోయిపాడు దన్నాన పేట సమీపాన వెనుక నుంచి కారును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వీరిద్దరూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.