భర్త వేధింపులపై కేసు నమోదు
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:26 AM
శ్రీకాకుళంలోని నానుబాలవీధికి చెందిన బొమ్మాళి గిరిబాబు అనుమానంతో తనను వేధిస్తున్నాడని ఆయన భా ర్య స్వర్ణకృప శ్రీకాకుళం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని నానుబాలవీధికి చెందిన బొమ్మాళి గిరిబాబు అనుమానంతో తనను వేధిస్తున్నాడని ఆయన భా ర్య స్వర్ణకృప శ్రీకాకుళం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సో మవారం ఎస్‌ఐ లక్ష్మి కేసు నమోదు చేసి వివరాలను వెల్లడించారు. గిరిబాబు తన భార్య, ఇద్దరి పిల్లలతో కృష్ణాపార్కు సమీపంలోని నానుబాల వీధిలో నివా సముంటున్నాడు. తరచూ భార్యపై అనుమానంతో కొడుతున్నాడు. ఈనెల 8న రక్తం వచ్చినట్లు కొట్టడంతో స్వర్ణకృప శ్రీకాకుళం రిమ్స్‌లో చేరి చికిత్స పొందు తోంది. ముఖం, తలభాగంలో గాయాలు ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా గిరిబాబు గతంలో బలగ ప్రాంతంలో ఓ వ్యక్తిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు
కొట్లాటలో ముగ్గురికి గాయాలు
ఇచ్ఛాపురం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం సుమాడి జంక్షన్ వద్ద జరిగిన కొట్లాటలో పట్టణానికి చెందిన ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఓ దాబా వద్ద ఒడిశాకు చెందిన వ్యక్తులు, పట్టణ పరిధి బెల్లుపడకు చెందిన ఉప్పాడ రాజారెడ్డి, ఉప్పాడ సుధారెడ్డి, దుర్గాసి భీమారెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఒడిశాకు చెందిన గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేయడంతో వీరి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని 108లో ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఒడిశా ప్రాంతంలో కొట్లాట జరగడటంతో ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారని పట్టణ ఎస్‌ఐ ముకుందరావు తెలిపారు.