కార్పెంట్, సెల్ షాపుల దగ్ధం
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:08 AM
వాండ్రం గి పంచాయతీ పాత బ స్టాండ్ సమీపంలో గురు వారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో కార్పెంట్ షాపుతో పాటు మొబైల్ దుకాణం దగ్ధమ య్యాయి.
జి.సిగడాం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): వాండ్రం గి పంచాయతీ పాత బ స్టాండ్ సమీపంలో గురు వారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో కార్పెంట్ షాపుతో పాటు మొబైల్ దుకాణం దగ్ధమ య్యాయి. కార్పెంటర్ దు కాణంలో విద్యుత్ షార్ట్ స ర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో దుకాణం నుంచి పొగలు రావడంతో స్థానికులు చూసి దుకాణదారులకు సమా చారం ఇచ్చారు. వెంటను పొందూరు అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను అదుపు చేసినా అప్పటికే సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో అరసవిల్లి రాంబాబుకు చెందిన రూ.లక్షల విలువైన డిజైన్ డోర్ చెక్కు మిషన్, కంప్యూ టర్‌లతోపాటు కలప దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. అలాగే పొగిరి తవిటి నాయుడుకు చెందిన మొబైల్ షాపులోని సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు కాలిపోయాయి. వీటి విలువ సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటాయిన బాధితుడు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తీవ్రంగా నష్ట పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.