Share News

ఫిర్యాదుల పరిష్కారంలో శ్రద్ధచూపాలి

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:59 PM

ప్ర జల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారా నికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఫిర్యాదుల పరిష్కారంలో శ్రద్ధచూపాలి
టీడీపీలో చేరిన వారితో మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్ర జల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారా నికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాల యంలో ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ఆ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అ ధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా నియోజకవ ర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌ ఆధికారులు మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో అవస రమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేం దుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రధానంగా గ్రామా ల్లో జరుగుతున్న డ్రైనేజీలు, రహదారుల పనులు వేగవంతం చేయాలన్నారు. పనుల నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే పర్యవేక్షణ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్‌, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంతబొమ్మాళి మండలం కోటపాడు, వడ్డితాండ్ర పంచాయతీల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీడీపీలో చేరారు. అదివారం నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని అందుకే వివిధ గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందగా టీడీపీలో చేరుతున్నారని మంత్రి అన్నారు. కార్యక్ర మంలో కోటపాడు పంచాయతీ మాజీ సర్పంచ్‌ అప్పలరాజు, నాయకులు రెడ్డి అప్పన్న, ఎల్‌ఎల్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌పై హర్షం

కోటబొమ్మాళి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): మహత్ముడే మెచ్చిన పొందూరు ఖాదీకి జియో గ్రాఫికల్‌ ఐడింటిఫికేషన్‌ (జీఐ) (1049) ట్యాగ్‌ ఇస్తూ కేంద్రం నిర్ణయం వెలువరించడం ఎంతో అనందంగా ఉందని, ఇందుకు కేంద్రమంత్రి కింజ రాపు రామ్మోహన్‌నాయుడు చేసిన కృషి ఎనలే నిదని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగేఽళ్లుగా ఈ విషయమై రామ్మో హన్‌నాయుడు ఎంతగానో కృషి చేశారన్నారు. పొందూరు ఖద్దరుకి జాతీయ, అంతర్జాతీయ గు ర్తింపు దక్కేలా నిర్ణయం తెలుపడం కూటమి ప్ర భుత్వ విజయంగా అభివర్ణించారు. జీఐ ట్యాగ్‌తో నకిలీలు నివారించవచ్చన్నారు. జిల్లాలో ఉన్న పొందూరు ఖాదీకి స్వాతంత్ర్యానికి ముందు ఎంతో గుర్తింపు ఉండేదని, ఇప్పుడు భౌగోళిక గుర్తింపు రావడం శుభపరిణామన్నారు. ఇందుకు ఎంతో సహకరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఏర్పాడ్డాక గతంలో ఎన్నడూలేని విధంగా స్థానిక ఉత్పత్తులకు దేశీయ మార్కెట్‌ల్లోనే కాకుండా అంతర్జాతీయ విపణిలో కూడా బ్రాండింగ్‌ కల్పించడంతో నేతన్నలకు మంచి గౌరవం దక్కిందన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 11:59 PM