Share News

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:56 PM

జాతీయ రహదారిపై కోమర్తి పెట్రోల్‌ బంకు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
నుజ్జునుజ్జయిన ద్విచక్ర వాహనం, కారు ముందు భాగం

  • ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

నరసన్నపేట, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై కోమర్తి పెట్రోల్‌ బంకు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట నుంచి శ్రీకాకుళం ద్విచక్ర వాహనంపై పోలాకి మండలం తలసముద్రం గ్రామానికి చెందిన పి.శ్రీను, సంతోష్‌ వెళ్తుండగా.. వీరి వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొని ముందు ఆగిఉన్న లారీ కిందకి ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న శ్రీను, వెనుక కూర్చున్న సంతోష్‌తోపాటు కారు డ్రైవ్‌ చేస్తున్న దుర్గారావు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108వాహనం, నేషనల్‌ హైవే అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. కారు కోటబొమ్మాళి మండలం కిష్టుపురం గ్రామానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించామన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:56 PM