Share News

గిరిజనుల్లో సామర్థ్యాన్ని పెంపొందించాలి

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:16 AM

గిరిజనుల్లో సామర్థ్యం పెంపునకు కృషి చేయాలని సీతంపేట ఐటీడీఏ పీవో యశ్వంత్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

గిరిజనుల్లో సామర్థ్యాన్ని పెంపొందించాలి
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో యశ్వంత్‌ కుమార్‌రెడ్డి

మెళియాపుట్టి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): గిరిజనుల్లో సామర్థ్యం పెంపునకు కృషి చేయాలని సీతంపేట ఐటీడీఏ పీవో యశ్వంత్‌ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మెళియాపుట్టిలో ఆదికర్మ యోగి పథకంపై శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు ప్రాధాన్యం ఇచ్చే పనులు చేయాలని ఉద్దేశ్యంతో ఈ పథకం ఏర్పాటు చేశారన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, గిరిజనుల ఆర్థిక అభివృద్ధి తీసుకోవాల్సి చర్యలపై అడిగి తెలుసుకున్నారు. గిరిజనులకు పాలన, ప్రభుత్వ పఽథకాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. కార్యక్ర మంలో ఏటీడబ్ల్యూ ఓ.సూర్యానారాయణ, తహసీల్దార్‌ పాపారావు, ఎంపీడీవో ప్రసాద్‌ పండా పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:16 AM