Share News

ప్రశాంతంగా ఎడ్‌సెట్‌

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:27 AM

బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎడ్‌సెట్‌-2025 జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో గురువారం ప్రశాంతంగా జరిగింది.

 ప్రశాంతంగా ఎడ్‌సెట్‌
శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో అభ్యర్థుల హాల్‌ టికెట్లను పరిశీలించి అనుమతిస్తున్న నిర్వాహకులు

ఎచ్చెర్ల, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎడ్‌సెట్‌-2025 జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో గురువారం ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. ఎడ్‌సెట్‌ ప్రాంతీయ సమన్వయకర్త గురుగుబెల్లి స్వామినాయుడు కేంద్రానలను పర్యవేక్షించారు. శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో 281కు 253 మంది, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో 180కు 153 మంది, ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో 230కు 198 మంది, కోర్‌ టెక్నాలజీస్‌లో 321కు 283 మంది హాజరయ్యారు. నాలుగు కేంద్రాల్లో కలిపి 1,012కు గాను 887 మంది హాజరయ్యారు.

ప్రశాంతంగా లాసెట్‌

మూడేళ్లు, ఐదేళ్లు ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం ఏపీ లాసెట్‌-2025 ఆన్‌లైన్‌లో ప్రశాంతంగా జరిగింది. శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల (చిలకపాలెం)లో 279కు 193 మంది హాజరుకాగా 86 మంది గైర్హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల(ఎచ్చెర్ల)లో 179కు 136 మంది హాజరుకాగా, 43 మంది గైర్హాజరయ్యారు.

ఐటీఐ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఎచ్చెర్ల, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశం కోసం అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో గురువారం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు పదో తరగతిలో మార్కులు, రిజర్వేషన్‌ ప్రాతిపదికన ఆహ్వానించారు. జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కె.సుధ, జిల్లా అడ్మిషన్ల కన్వీనర్‌, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుఽధాకరరావు పర్యవేక్షణలో ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరిగింది. తొలిరోజు 277 మందిని పిలవగా 109 మంది హాజరయ్యారు. 101 మంది వివిధ ఐటీఐల్లో సీట్లు పొందారు. రెండో రోజు శుక్రవారం 278వ ర్యాంకు నుంచి 562వ ర్యాంకు వరకు 284 మందిని పిలిచారు. ఈ నెల 8వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ కొనసాగుతుంది. అనివార్య కారణాలతో నిర్దేశించిన తేదీల్లో హాజరుకాని విద్యార్థులకు ఈ నెల 10న ఉదయం 9నుంచి 11 గంటల వరకు కౌన్సెలింగ్‌ ఉంటుంది.

Updated Date - Jun 06 , 2025 | 12:27 AM