శ్రమదానం చేసి.. గోతులు పూడ్చి
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:45 PM
పాత బస్టాండ్ వద్ద నెలల తరబడి రోడ్డంతా గోతుల మయంగా తయా రై తరచూ ప్రమా దాలు జరుగు తున్నాయి. దీంతో సమస్యను గుర్తిం చిన ఆటో డ్రైవర్లు గురువారం శ్రమదానం చేసి గోతులను పూడ్చారు.
ఇచ్ఛాపురం, జూలై 24(ఆంధ్రజ్యోతి): పాత బస్టాండ్ వద్ద నెలల తరబడి రోడ్డంతా గోతుల మయంగా తయా రై తరచూ ప్రమా దాలు జరుగు తున్నాయి. దీంతో సమస్యను గుర్తిం చిన ఆటో డ్రైవర్లు గురువారం శ్రమదానం చేసి గోతులను పూడ్చారు. బుధవారం రాత్రి స్కూటీపై వెళ్తున్న ఇద్దరు బాలికలు గోతిలో పడి గాయాలపాలయ్యారు. వారిని ఆటో డ్రైవర్లు ఆసుపత్రికి తరలించారు. అధికారులు పట్టించుకో వడం లేదని, తామైనా గోతులను పూడ్చాలని నిర్ణయించుకుని శ్రమదానం చేశారు. రోడ్డులోని సుమారు 15 గోతులను పూడ్చారు. దీంతో వాహన దారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రతినిధులు ఎర్రయ్య రెడ్డి, మోహన్, హరి తదితరులు పాల్గొన్నారు.