చివరి బస్తా వరకు కొనుగోలు: అశోక్
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:54 PM
వైసీపీ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు.
కంచిలి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నా రని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. బుధవారం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో రైతులు పండించిన పంట చివరిబస్తా వరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. రబీ కాలానికి అవసరమైన విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ టి భవానీ శంకర్, ఏవోలు కె.సురేష్, బి.నర్సింహమూర్తి, శ్రీదేవి, తహసీల్దార్లు ఎన్.రమేష్ కుమార్, అప్పలస్వామి, ఎంపీడీవో వి.తిరుమలరావు, ఎఫ్‌పీవో సీఈవోలు ప్రియాంక, సౌజన్య, ఉద్యానవనశాఖాధికారి మాధవీలత, కూటమి నాయకులు మాదిన రామారావు, పూర్ణ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుపై ఆందోళన వద్దు
ఆమదాలవలస, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో సాగు చేసిన ధాన్యం కొనుగోలుపై ఆందోళన చెంది దళారు లను నమ్మి మోసపోవద్దని పీఏసీఎస్ ఽఅధ్యక్షురాలు సిమ్మ మాధవి అన్నారు. బుధవారం సైలాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆదే శాల మేరకు మండలంలో మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో ఏవో ఎం. మోహన్‌రావు, టీడీపీ నాయకులు నూకరాజు, ఎస్.మురళీధర్, ఎ.భాస్కర రావు, టి.రాము, టి.అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.