చార్‌ధామ్ యాత్రకు వెళ్లి వ్యాపారి మృతి
ABN , Publish Date - May 22 , 2025 | 12:02 AM
పట్టణంలో శ్రీరామనగర్‌కు చెందిన వ్యాపారి జామి శ్రీధర్ (54) గుండెపోటుకు గురై బుధవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు.
నరసన్నపేట, మే 21(ఆంధ్రజ్యోతి): పట్టణంలో శ్రీరామనగర్‌కు చెందిన వ్యాపారి జామి శ్రీధర్ (54) గుండెపోటుకు గురై బుధవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. వారం రోజుల కిందట యాత్ర కు స్థానిక వ్యాపారులతో కలిసి వెళ్లినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ కొండలపై వెళుతున్న సమ యంలో ఒక్కసారి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. తోటి యాత్రికులు పరిశీలించినప్పటికే శ్రీధర్ మృతి చెందినట్లు చెబుతున్నారు.
గల్లంతైన వ్యక్తి ...
రణస్థలం, మే 21(ఆంధ్రజ్యోతి): నారువ గ్రామానికి చెందిన నిద్రబంగి సంతోష్(32) స్నేహితులతో మంగళవారం సముద్ర స్నానానికి వెళ్లి గల్లం తైన విషయం విదితమే. జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి చెప్పిన వివ రాల మేరకు.. సంతోష్, రమణ, సూర్యనారాయణ సముద్ర స్నానం కోసం మంగళవారం దోనిపేట తీరానికి వెళ్లారు. అయితే ముగ్గురు స్నానం చేస్తున్న సమయంలో పెద్ద కెరటం రావడంతో సంతోష్ గల్లంతయ్యాడు. బుధవారం సంతోష్ మృతదేహం బుధవారం దోనిపేట తీరానికి చేరు కుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ఆసుపత్రికి తర లించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ మహారాష్ట్ర వాసి..
హిరమండలం, మే 21(ఆంధ్రజ్యోతి): వంశధార రిజర్వాయర్ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మేడపైనుంచి పడి తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎండీ యాసిన్ తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. వంశధార రిజర్వాయర్ నిర్మాణం నిమిత్తం కూలి పనులు చేసేందుకు మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి కమలేష్‌కుమార్(41) వచ్చాడు. కూలీ లకు కేటాయించిన లేబర్ క్యాంపు మేడపై ఠాకూర్ సోమవారం రాత్రి పడుకున్నాడు. తెల్లవారుజామున కిందకు దిగు తుండగా నిద్రమత్తులో మేడ మీద నుంచి పడిపోయాడు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం తోటి కూలీలు మంగళవారం విశాఖపట్నం కేజీహెచ్‌కు తర లించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుం బ సభ్యులకు సమాచారం అందించామని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఠాకూరు ముందురోజే రిజర్వాయర్ నిర్మాణం పనుల కోసం వచ్చినట్లు సంబంధిత కంపెనీ ప్రతినిధి శ్రీనివాసరావు తెలిపారు.