Share News

బస్సులు నిలుపుదల చేయాలి

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:38 PM

బూర్జ మండలం లక్కుపురం కూడలిలో బస్సులు ఆపడం లేదని, దీంతో ఇబ్బం దులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కూడలిలో రోడ్డుపై బైఠా యించి నిరసన తెలిపారు.

బస్సులు నిలుపుదల చేయాలి
నిరసన తెలుపుతున్న విద్యార్థులు

లక్కుపురం కూడలిలో విద్యార్థుల నిరసన

సరుబుజ్జిలి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): బూర్జ మండలం లక్కుపురం కూడలిలో బస్సులు ఆపడం లేదని, దీంతో ఇబ్బం దులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కూడలిలో రోడ్డుపై బైఠా యించి నిరసన తెలిపారు. ఈ కూడలి సమీపంలోని 10 గ్రామాల నుంచి నిత్యం కళాశాలలు, పాఠశాలలకు విద్యార్థులు పాల కొండ, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర ప్రాం తాలకు వెళు తుంటారని, అయితే రిక్వెస్టు స్టాప్‌ ఉన్నా ఫలితం కనిపిం చడం లేదన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కె.దీప విద్యార్థు లతో మాట్లాడారు. ఇదివరకు అనేక పర్యాయాలు ఆర్టీసీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని విద్యార్థు లు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యను ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ దృష్టికి తీసుకొని వెళతామన్నారు. విద్యార్థుల ఆందోళ నతో ప్రధానమార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వెంటనే ఎస్‌ఐ ప్రవల్లిక సిబ్బందితో చేరుకొని సమస్య పరిష్కా రానికి కృషి చేస్తానని చెప్పడంతో విద్యార్థినీ విద్యార్థులు శాంతించారు.

Updated Date - Nov 03 , 2025 | 11:38 PM