Share News

టెక్కలికి బస్సు సౌకర్యం కల్పించాలి

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:42 AM

మండలం కేంద్రం నుంచి డివిజనల్‌ కేం ద్రం టెక్కలికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ బుధవారం కొత్తూరులో సీపీఎం నాయకులు సిర్ల ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

టెక్కలికి బస్సు సౌకర్యం కల్పించాలి
కొత్తూరులో నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

కొత్తూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలం కేంద్రం నుంచి డివిజనల్‌ కేం ద్రం టెక్కలికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ బుధవారం కొత్తూరులో సీపీఎం నాయకులు సిర్ల ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సుదూరు ప్రాంతంలో ఉన్న టెక్కలికి వివిధ పనులపై ప్రజలు వెళ్లాలంటే నాలుగు బస్సులు మారాల్సి వస్తుందని, దీంతో ప్రజలు అవస్థ పడుతున్నారంటూ నినాదాలు చేశా రు. వీటితో పాటు మండలంలో మారుమూల ప్రాంతాలైన గొట్టిపల్లి, ఆకుల తంపర, అంగూరు, దిమిలి, పోనుటూరు, కడుమ గ్రామాలకు బస్సులు పున ద్ధరించాలని కోరారు. సీపీఎం నాయకులు నిమ్మక అప్పన్న, దుర్గారావు, జమ్మయ్య, రమేష్‌, గణపతి రాములు సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:42 AM