దారుణంగా కుక్కేసి.. అక్రమ రవాణా
ABN , Publish Date - May 31 , 2025 | 12:14 AM
జిల్లాలో మూగజీవాల అక్రమ ర వాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇరుకైన వాహనాల్లో కుక్కేసి తరలించేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
బుడుమూరు వద్ద తొమ్మిది ఆవులతో వ్యాన్ సీజ్
లావేరు, మే 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూగజీవాల అక్రమ ర వాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇరుకైన వాహనాల్లో కుక్కేసి తరలించేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ నెల 25న అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యాన్లన నవభారత్ జంక్షన్ జాతీయ రహదారి వద్ద ఎచ్చెర్ల పోలీసులు పట్టుకున్నారు. నారా యణవలస నుంచి అలమండకు తరలిస్తున్న 12 ఆవులతో ఓ వ్యాన్, 6 గేదెలతో మరో వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కొత్తవలస గోశాలకు తర లించారు. తాజాగా శుక్రవారం నరస న్నపేట నుంచి విశాఖ వైపు తొమ్మిది ఆవులతో వెళ్తున్న వ్యాన్‌ను బుడుమూరు వద్ద లావేరు పోలీసులు అడ్డుకుని సీజ్ చేశారు. నరసన్నపేట పరిసర ప్రాంతాల్లో వాటిని కొనుగోలు చేసి తరలి స్తున్నట్టు గుర్తించామని ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం కోరోపురాళ్లు గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ పి.నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.